2008 లో గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ లో మొదటి ఫారెన్ గార్డ్ గా రసిలా వాధేర్ పేరు వెలుగులోకి వచ్చింది ఆమె ఇప్పుడు రెస్క్యూ డిపార్ట్మెంట్ అధిపతిగా పదోన్నతి పొందారు.మహిళా గార్డ్ గా గాయపడిన పెద్దపులుల పిల్లలను రక్షించడమే కాకుండా తల్లి లేని జంతువులను కూడా రక్షించి కాపాడింది రసిలా వాధేర్.ఆమె గురించి భారతీయ అటవీ సేవల అధికారి పర్వీన్ కస్వాన్ ట్వీట్ చేస్తూ,అడవికి రాజైన సింహం కన్నా ఈ 36 సంవత్సరాల రసిలా వాధేర్ ధైర్యంగా నమ్మకంగా అడుగులు వేస్తుంది అన్నారు. ఇప్పటి వరకు 300 సింహాలు 500 చిరుతలు ముసళ్ళు కింగ్ కోబ్రా లు , వెయ్యి వరకు జంతువులను రకరకాల ప్రమాదాల నుంచి కాపాడింది రసిలా వాధేర్ ఈమెను లయన్ క్వీన్ అంటారు.