ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేసింది సోఫియా రంజని. ఫుడ్ ఫ్లేవరిస్టుగా హైదరాబాద్ లో మన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో చేరింది. ఎన్నో రుచులు చూసే ఉద్యోగం ఆమె పని. నాలుక ముక్కుతోనే కాఫీ పొడి,చాక్లెట్లు,స్వీట్లు,ఐస్ క్రీం ఫ్లేవర్లు రోజుకి వెయ్యి పైనే చూస్తుంది సోఫియా.ప్రపంచవ్యాప్తంగా రకరకాల రుచులు తయారు చేసే సంస్థల్లో మొదటి ఆరు స్థానాల్లో ఉంది ఆమె పని చేసే సంస్థ. ఎన్నో బహుళజాతి సంస్థలు కోరుకునే రుచులు పరిమళాలు ఇక్కడ తయారవుతాయి. ఫుడ్ ఫాలోగ్రఫీ కూడా చేస్తుంది సోఫియా రంజని. ప్రముఖ రెస్టారెంట్లు పబ్లిసిటి కోసం ఈమె ఫొటోలు కావాలని అడుగుతారు.

Leave a comment