పల్లెటూరి రైతు మోనిచన్ అతని భార్య సుసమ్మ తను ఇద్దరు కూతుళ్లు చదువు కోసం పట్టణానికి కాపురం మారుస్తారు. అప్పటివరకూ తన పొలం తన కుటుంబం చుట్టుపక్కల ప్రజలతో సంతోషంగా ఉన్న మోనిచన్ నెమ్మదిగా నగర జీవితపు అలవాట్లలో కి మారిపోతాడు. చిన్న అబద్ధాలు, లౌక్యం గా మాట్లాడటం అలవర్చుకున్నాడు. నాగరికమైన జీవితానికి అవసరమైన వస్తువులన్నీ ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ వంటివి ఇంట్లోకి చేరుతాయి దొంగనోట్ల మార్పిడి వరకు వెళ్లి మోనిచాన్ టీవీ మోహం తో తీరిక లేకుండా ఉంటుంది. ఆ దంపతుల పెద్ద కూతురు రేప్ కు గురై మరణిస్తుంది విచారణలో రేప్ చేసిన బాలుడిని జువైనల్ హోమ్ కి తరలిస్తారు నగరం ఆ కుటుంబం ఆనందాన్ని లాగేసుకుంటుంది. మమ్ముట్టి చాలా బాగా నటించాడు సినిమా ప్రైమ్ లో ఉంది చూడవలసిన చిత్రం.
రవిచంద్ర. సి
7093440630