Categories
డిప్రేషన్,ఆందోళన వంటివి ఎప్పుడు ఎక్కువగా మహిళల విషయంలో చేపుతూ ఉంటారు. కానీ ఇవి పురుషుల్లోనే ఎక్కువనే ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు మానసిక సమస్యకు గురవుతారని అయితే ఈ విషయాలు ఎవ్వరితో పంచుకోనేందుకు వాళ్ళు ఇష్టపడరని, ఇదే అసలు సమస్య అని అధ్యయనకారులు చెపుతున్నారు. డిప్రేషన్ ను వెల్లడించకుండా మనసులో దాచుకొవటం వల్ల అది మరింత తీవ్రమై,తమని తాము హింసించుకోవటం ఇతరులను హింస పెట్టటం చేస్తుంటారని చెపుతున్నారు. శృంగారం పట్ల ఆసక్తి పోగోట్టుకొని ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారని అదే స్త్రీల విషయంలో షేరింగ్ చేసే అలవాటు వల్లనే వాళ్ళు మనసులో రేగిన బాధను తోటి స్నేహితులతో చెప్పుకొని దాన్ని తగ్గించుకోంటారని అధ్యయనకారులు చెపుతున్నారు.