పాశ్చాత్య దేశాల్లో చాలా కార్పోరేట్స్ పవర్ న్యాప్ కు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇలా కాసేపు కునుకు తీయడం వల్ల చురుకుదనం పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ బావుంటుంది. అన్నింటినీ మంచి పని లో పర్ ఫార్మేన్స్ పెరుగుతుంది. గంటలకొద్దీ విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల అలసట వస్తుంది. పనిలో చురుకుదనం తగ్గి పోతుంది. అలాగే కష్ట పడి పని కొనసాగించే కంటే కంప్యూటర్ షట్ డౌన్ చేసి కళ్ళు మూసుకుని చిన్న కునుకు తీస్తే అన్ని సరయిపోతాయి. ఈ నిద్ర తో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సమస్యలు సులువుగా పరిష్కరించుకోగల సమాధ్యం వుంటుంది. ఈ పవర్ న్యాప్  ఎక్కడయినా తీయవచ్చు. బాగా డల్ గా అనిపిస్తే పది నుంచి ౩౦ నిమిషాల పాటు నిద్ర పొతే అంతా మ్మేలే జరుగుతుందని పరిశోధనలు చెప్పుతున్నాయి.

Leave a comment