Categories
పని ఒత్తిడి మహిళల్లో గర్భధారణ అవకాశాలు తగ్గించేస్తోందని ఒక కొత్త అధ్యయనం చెపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఇంటా బయటెంతో పని ఒత్తిడి ఎదుర్కోంటున్నారు. ఆ శ్రమ ,మానసిక ఒత్తిడి వారిలో గర్భధారన అవకాశాలు 25 శాతం తగ్గిస్తోందని అధ్యయనాలు చెపుతున్నాయి. పిల్లలు కావాలనుకొంటే మహిళలు ముందుగా తమ ఆరోగ్యం పైన తాము ఎదుర్కొంటున్న పని ఒత్తిడిపైన దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.సంతానం కోరుకొనే మహిళలకు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యమని త్వరగా సంతానం కావాలనుకొంటే ముంందుగా ఒత్తిడితగ్గించుకొవాలని పోషకాలతో కూడిన ఆహారం తీసుకోంటూ ,బరువు పెరిగితే తగ్గించుకొనే దిశగా ఆలోచించాలని అధ్యయనకారులు చెపుతున్నారు.