నీహారికా, సినిమా ప్రేమలకు వాస్తవమైన అంశాలకు ఇప్పుడు చాలా తేడా వుంతుని. ఒక నాటకం, సినిమా ఇది మనోరంజకాలు సంతోష పెట్టేందుకు ఇందులో ఎన్నో కల్పితాలుంటాయి. ఒక సినిమాలో అన్నగారు తమ్ముళ్ళ పై వినరత మైన మమకారంతో త్యాగాలు చేస్తాడు. పసి పిల్లాడు చెల్లిని ప్రాణసమానంగా ప్రేమిస్తాడు. కానీ నిజ జీవితంలో తనకు చెల్లిలో తమ్ముడో పుడితే పిల్లలు కొంతసేపు ఉత్సాహ పరిచినా ఆ కొత్త సభ్యుని రాకతో తనకు వున్నా సౌకర్యాల్లో ఒక్కటి పోయినా సహించదు. కనీసం తను పడుకునే గదిలో పాపాయిని పడుకోబెట్టినా ఇస్తాపదకపోవచ్చు. తమను పట్టుకోవడం లేదనో, తన పట్ల వున్న ఎటెన్షన్ తమ్ముడో, చెల్లెలో లాక్కుంటుంన్నారని కోపం రెండో బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను తమతో పాటు ఇంట్లో వున్నా పెద్ద బిడ్డ ప్రేమించాలని ముద్దుగా బాధ్యతగా చూసుకోవాలని తల్లి దండ్రీ భావించకూడదు. వాడూ పసివాడే నని, ఇంకో పసి బిడ్డను లాలించి, ప్రేమించే శక్తి వాడికి ఉంటుందా అని అనుకోవద్దు. అస్సలు పెద్ద వాళ్ళే తమ్ముడి గురించి, పెద్ద పిల్లవాడికి నచ్చజెప్పి, వాడి రాక వలన, ణీ స్ధానం ఏ మాత్రం కల్లేదని వాడిని ఒప్పించి నెమ్మదిగా పసివాడిని పెద్దవాడికి దగ్గర చేయాలి. ఈ బాధ్యత తల్లి దంద్రులదే.
Categories