ఇప్పుడన్నీ అపార్టుమెంట్ ఇళ్లే రెండు మూడు గదుల ఇళ్ళు .సాధాసీదా గా ఉండకుండా దానీకి కాస్త మంచి లుక్ తీసుకురావాలంటే ఖరీదైన కార్పెట్ కావాలి. మళ్ళీ దానిని శుభ్రం చేయటం ,దుమ్ము దులపటం అదో పెద్ద శ్రమ. ఇప్పుడు త్రీడీ కార్పెట్ ఫ్లోర్ వాల్ పేపర్ తో ఇల్లు ఇంద్ర భవనంలా మార్చేయవచ్చు. ఐరోపా ,పర్షియన్ ,అరబిక్ చిత్ర కళల అందాలను ఇంట్లో పరిచేయవచ్చు.ఈ పేపర్లు పాలీ వినైల్ పూసిన ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.నున్నగా మెరిసి పోతూ గీతలు ముడతలు లేకుండా ఉంటుంది. త్రిడీ కనుక ఎత్తుగా ,లోతుగా ,గమ్మత్తుగా మాయచేస్తూ ఉంటాయి. తడి బట్టతో తుడిచినా పాడవకుండా ఉంటాయి.