Categories
వేసవి వచ్చింది అంటే చల్లని నీళ్ళు పానీయాలు ఇష్టం గా తాగుతారు .ఈ కరోనాతో చల్లని తినద్దు తాగద్దు అని డాక్టర్ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి .కానీ కేవలం చల్లని పానీయాల వల్ల కరోనా రాదు .కరోనా రాకుండా పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. ఎండవల్ల డీహైడ్రేషన్ ఉంటుంది . పిల్లల లో ఇది మరీ ఎక్కువ .అందువల్ల పానీయాలు తీసుకోవటం మంచిదే . పిల్లల కు నార్మల్ కూల్ గా ఉన్నవి ఇవ్వచ్చు .దగ్గు , జలుబు రాకుండా చూసుకోవాలి .మూత్రం డార్క్ గా రాకుండా చూసుకోవాలి .మూత్రం రంగు లైట్ పసుపు పచ్చగానే ఉండేట్లుగా నీళ్ళు పానీయాలు ఎక్కువ తీసుకోవాలి .వేడిని తట్టుకొనేందు మజ్జిగ సబ్జా గింజలు నీళ్ళు తాగితే మంచిది .