Categories
ప్రతి రోజు పరుగు తీస్తే అనారోగ్యాలు దగ్గరకు రావని ఈ కారణంగా జీవన కాలం పెరుగుతుందని చెపుతున్నారు శాస్త్రవేత్తలు . హుద్రోగులు,కేన్సర్ బాధితులు వారానికి 25 నిముషాలు రన్నింగ్ జాగింగ్ చేస్తే ఆయుష్షు పెంచుకోవచ్చునని చెపుతున్నారు . ఇందుకోసం ఐదున్నర ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న రెండు లక్షల మంది జీవన శైలి ,ఆరోగ్య నివేదికలు పరీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు . రోజుకి 25 నిముషాల పటు రన్నింగ్ జాగింగ్ చేస్తే వారికి మరణం వచ్చే అవకాశాలు 27 శాతం తగ్గినట్లు అధ్యయనాలు రుజువు చేశాయి .