Categories
నడక కంటే పరుగులో ఎన్నో లాభాలున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్.పరుగుతో గ్రంధులు పనితీరు సక్రమమై సరిపడా హర్మోన్లు విడుదల అవుతాయి.లోపలికి ఎక్కువగా గాలి పీల్చుకొంటాం కనుక ఊపిరితిత్తులు బలపడతాయి.ఉదయం వేళ జాగింగ్ తో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.పరుగుతో నడుము కింది భాగంలోని కండారాలు ఎముకలు ధృడంగా అవుతాయి.కీళ్ళకు సంబంధించిన టెండన్లు,లిగ్ మెంట్లు బలపడతాయి.పరుగుతో కలిగే వత్తిడిని తట్టుకోవడం ద్వారా శరీరం కీళ్ళకు అవసరమైన లవణాలు సరఫరా చేస్తుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది.బాలెన్స్ పెరుగుతుంది.శరీరం పోశ్చర్ లోపాలు తొలగి చక్కని ఆకారం సంచరించుకొంటుంది.ముఖ్యంగా మధుమేహం అదుపులో ఉంటుంది.