ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసే వంద మందిలో ఒక్కరుగా సునీతా నారియన్ పేరుని టైమ్స్ పత్రిక గుర్తించింది. స్వచ్చంధ సేవా సంస్థ సొసైటీ ఫర్ ఎన్విరాన్మెంట్ కమ్యూనికేషన్ పరిశోధనా సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ల ను నడిపిస్తున్న పర్యావరణ వేత్త సునీతా నారియన్. బహుళ జాతి సంస్థలు ఉత్పత్తి చేసే సాఫ్ట్ డ్రింక్స్ లో విషపూరిత పదార్ధాలు వున్నాయి అని లేబరేటరీ రిపోర్ట్స్ ద్వారా నిరూపించి కొక్, పెప్సీ, కోలా కంపెనీలకు హడలెత్తించారు సునీత. పండ్లు ముగ్గపెట్టడం లో వాడుతున్న రసాయినాలు నిషేదపు ఉత్పత్తులు ప్రభుత్వం ఇబ్బందన్నా, ఢిల్లీ విధుల్లో డిజిటల్ ఆటో లో వాహనాలు పోయి సి.ఎన్.జి వాడకం వచ్చిందన్న నీడలా దాని వెనక వున్నది సునీత జల కాలుష్యం వచ్చిందన్న, వాయు కాలుష్యం , కాలుష్య కారణాలు డాక్యుమెంటేషన్ చేస్తారు సునీత. పద్మశ్రీ అవార్డు తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థల అవార్డులు, ఎన్నో గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు సునీత.
Categories