Categories
ఇప్పుడు వృత్తిరిత్యా వికాసపు కోర్సులు వచ్చాయి. ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి బాడి లాంగ్వేజ్ ఎలా ఉండాలి నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలు నేర్పిన నాటి నుంచి నేర్పవలసిన విషయాలు ఇవి. వారికి మర్యాదపూర్వకమైన మాటలు నేర్పాలి. ఇంటికి ఎవరు వచ్చినా వారితో గౌరవంగా ఎలా మెలగాలి వాళ్ళను ఎలా పలకరించాలో నేర్పాలి. తోటి పిల్లలు, ఇరుగు పొరుగులతో బంధువులతో మర్యాదగా మెలగటం నేర్పిస్తే ఎదిగే కొద్ది వాళ్ళలో సంస్కారం కనిపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. అంతే కాని పెద్దయ్యాక పట్టుబట్టి నేర్చుకునే విషయాలు కానేకావు.