ఇంటీరియర్ డిజైనింగ్ లో కొత్త ట్రెండ్స్ ఇంటి రూపం పూర్తిగా పాత, కొత్తల సమ్మేళనం లాగా మారిపోతుంది. ఈ మధ్య ఇళ్ళల్లో రాగి వాడకం ఎక్కువ చేసారు. డిజైనర్లు రాగికి కొత్త రూపం ఇచ్చి ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా చేసారు. పూల కాడల తో ఫ్లవర్ వాజ్ లు, పూల స్టాండ్లు, మొక్కల కుండీలు స్టడీలాంప్ లు, గడియారాలూ, షాండిలేయర్స్ తో రాగి  వెలిగిపోతుంది. రాగి పాత్రలో నీళ్ళు ఆరోగ్యం ఇస్తాయని ఆది నుంచి చెప్పుతూనే వున్నారు. రాగిలో వుండే యాంటీ బాక్టీరియల్ గుణాలతో ఎక్కువ రాగి పాత్రలునా క్రిమి రహితంగా ఉంటుందని డిజైనింగ్ నిపుణులు నిర్ణయిస్తున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు మూలా పడ్డ రాగి పాత్రలని హాల్లోకి లాక్కుని వచ్చి సందడి చేస్తుంది.

Leave a comment