పట్టు దుస్తులు వేసుకొని ఏ ఫంక్షన్ కో,దేవాలయానికో వెళ్తే ఏదయినా మరకలు పడే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ మరక పూర్తిగా పోవాలంటే వెంటనే చన్నిళ్ళలో ఆ మరక శుభ్రం చేయాలి. మరక మరీ ఎండిపోయి ఇంకిపోతే వదలటం చాలా కష్టం. అలాగే నెయిల్ పాలిష్ పొరపాటున దుస్తులకు అంటకుండా నెయిల్ పాలిష్ రిమూవర్ తో దాన్ని వెంటనే తుడిచేయాలి. ఇంక మరకలు పడితే ముందుగా పదినిముషాలు చన్నీళ్ళలో నానబెట్టాలి. ఆ మరక పడిన ప్రాంతాన్నిసరిగా టేబుల్ పైన పరిచి పెట్రోల్ తో రుద్దితే మరక పోతుంది నెయ్యి నూనె మరక లయితే కాస్త పౌడర్ చల్లి కాసేపు ఆరనివ్వాలి నూనెను నెయ్యిని పౌడర్ పీల్చేస్తుంది ఆ తర్వత చన్నిళ్ళలో ఉతికేస్తే సరిపోతుంది.

Leave a comment