ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నాపెద్దారెడ్డి సీతారెడ్డి యూఎన్ పీస్ మెడల్, సర్టిఫికెట్ అందుకొన్నారు. తెలంగాణ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ విధులు నిర్వహిస్తున్న సీతాదేవి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం లో పనిచేసేందుకు ఎంపికయ్యారు. అంతర్గత సమస్య లతో అతలాకుతలం అవుతున్న సుడాన్,తైమోర్ తదితర ప్రాంతాల్లో శాంతి పరిరక్షణ కు అక్కడ పోలీస్ విభాగానికి శిక్షణ ఇచ్చేందుకు ఐక్యరాజ్యసమితి ఈ శాంతి పరిరక్షణ దళాన్ని ఉపయోగిస్తారు ఇలా ఐక్యరాజ్య సమితిలో కి సీతా రెడ్డి ఎంపిక కావడం ఇది రెండోసారి.