Categories
ఎన్నో నగరాల్లో యువతులకు పీరియడ్ పావర్టీ మహిళల పైన జరిగే హింస వారి మానసిక ఆరోగ్యం గురించి శిక్షణ ఇస్తోంది గర్ల్ అప్. 2010 లో యు ఎస్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ గర్ల్ అప్ లో భారత దేశానికి అతిధి అరోరా నాయకత్వం వహిస్తున్నారు. మహిళా వ్యాపార వేత్తలను ప్రోత్సహించేందుకు అప్రెంటిస్ హబ్ పేరుతో 18-21 ఏళ్ల యువతులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది గర్ల్ అప్. ఈ సంస్థ ద్వారా నిధులు సేకరించి వెయ్యి మంది యువతులకు రెండేళ్ల పాటు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా అందించింది అదితి. జస్ట్ ఎ గర్ల్ ఐ ఎస్ సి కి ఇన్ క్లూజివ్ అడ్వైజరీ బోర్డ్ సభ్యురాలు కూడా ఈమె తాజాగా ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో స్థానం దక్కించుకుంది.