“మొదటి సారి గుండె నొప్పి వస్తే కొద్దిగా వస్తుంది. రెండవ సారి తీవ్రంగా వస్తుంది. మూడవసారి వేస్తే మరింత తీవ్రంగా వస్తుంది..అపుడు దీనిని హార్ట్ ఎటాక్ అంటారు..అపుడు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మనిషి చనిపోతాడు. మొదటి సారి వచ్చినపుడు మనిషికి ఏమీ కాదు.”

ఈ పుకారు ఎవరు మొదలెట్టారోగానీ విపరీతంగా అమలులో ఉంది. చదువుకున్న వాళ్ళు కూడా దీనిని గాఢంగా నమ్ముతూ ఉంటారు. ” అదేంటి డాక్టర్ గుండెనొప్పి మొదటి సారి కదా వచ్చింది…మీరేంటి చాలా క్రిటికల్ ఉందని చెబుతున్నారు?!”. అని అడుగుతూ ఉంటారు.

నిజం: గుండె నొప్పి మూడు దశలలో తీవ్రతరమౌతుంది…అది పాథోలజీకి సంబంధించిన విషయం. క్లినికల్లీ గుండెనొప్పి ఏ దశలోనైనా బయట పడవచ్చు. ప్రస్తుతం మనకున్న sedentary జీవన విధానం వలన జబ్బు బయట పడే సమయానికే advanced stage లో ఉంటుంది. కాబట్టి మొదటి సారి నొప్పి వచ్చినా తీవ్రతరమైన జబ్బే ఐవుంటుంది.

డా. విరివింటి విరించి (కార్డియాలజిస్ట్)
+91 99486 16191

Leave a comment