ఒడి దుడుకులు ఎదురు కోకుండా ఎవరు విజయ తీరాలకు చేరుకోలేరు. సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడు ఒక సరళరేఖలా ఉండదు. అందుకే గెలుపు ఓటములు గురించి ఆలోచించ కుండా అనుకొన్నది చేయాలి అంటోంది మోనికా షెర్గిల్. నెట్ ఫ్లిక్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. వినోద్ రంగంలో వస్తున్న మార్పులను ముందుగానే ఉహించిందామె.వియాకామ్ 18 అనే అంకుర్ సంస్థ ప్రారంభించింది రెండేళ్ల లోనే వయాకామ్ భారత్ లో ఒటిటి విభాగంలో రెండో స్థానానికి చేరుకొంది. కొన్ని నెలల క్రితం నెట్ ఫ్లిక్స్ ఆమెను ఆహ్వానించింది. ఆ సంస్థలు సిరీస్,ఇంటర్నేషనల్ ఒరిజినల్స్ విభాగాలకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించి చాలా త్వోరగా ఉపాధ్యక్షురాలిగా ఎదిగింది మోనికా.  ప్రస్తుతం ఒటిటి  ఫ్లాట్ ఫామ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లలో నెట్ ఫ్లిక్స్ ముందు వరసలో ఉంది గ్రీన్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకొన్న ‘లివింగ్ ఆన్ ఎడ్జ్ ‘కార్యక్రమానికి రిపోర్టర్ గా కెరీర్ ప్రబించింది మోనికా.

Leave a comment