నీహారికా,

ఒక పరిశోధన ఫలితాన్ని తల్లి దండ్రులు శ్రద్ధగా వుంచుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రులు గొడవపడుతున్నా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా వాళ్ళు ఎమోషనల్ గా హర్ట్ అయిపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వుతారట. ఒక వేళ అలా తల్లిదండ్రులు నిరంతరం డిప్రెషన్ మైండ్ లో వుంటూ, తమ ఫీలింగ్స్ని పిల్లల పై రుద్దినా, వాళ్ళకు కఠినమైన రూల్స్ పెట్టినా పిల్లలు ఖాతరు చెయ్యని స్ధితికి వస్తారట ముఖ్యంగా టీనేజ్ లో పిల్లల ప్రవర్తన వల్ల మానసికంగా గాయపడి, వారిలో నెగిటివ్ ఎమోషన్స్ మల్టిపుల్ అవుతాయని పరిశోధకులు చెప్పుతున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా పోయి వాళ్ళే ఇష్టం వచ్చినట్లు  గడపడం అబద్దాలు ఆడటం, ముఖ్యంగా తల్లి దండ్రుల సమక్షం నుంచి దూరం అయ్యేందుకు చాలా చేస్తారని పిల్లల విషయంలో చాలా శ్రద్దగా ఉండాలని వాళ్ళలో ఎక్కువ సమయం గడపాలని, పెటిగే వయస్సులో వారి ఆలోచన పాలనా శ్రద్దగా చూడాలని. వారిని మనస్పూర్తిగా పట్టించుకుంటేనే మానసికంగా బలంగా తయ్యారావ్వుతారని చెప్పుతున్నారు. మరి పెద్దవాళ్ళు పిల్లల్లా పవ్రిస్తే ఇబ్బందే కదా!

Leave a comment