Categories
నెక్ లెస్ అనుసరించే ఆభరణాలు ధరించాలి అంటారు స్టైలిస్ట్ లు. చోకర్ వేసుకోవాలి అనుకుంటే రౌండ్ నెక్ బ్లౌజ్ ధరించాలి. అది డైమండ్,పెరల్ కుందన్ ఏదైనా కావచ్చు. రౌండ్ నెక్ టోన్ అందం వస్తుంది. వి నెక్ లైన్ అవుట్ ఫిట్ వేసుకుంటే వి షేప్ లో ఉన్న నెక్లెస్ బాగుంటుంది. ఆఫ్ షోల్డర్ డ్రెస్ లేదా టాప్ వేసుకుంటే మెడలో ఆభరణాలు బాగుండవు లేదా సింపుల్ లాకెట్ చాలు. టర్టిల్ నెక్ లేదా బ్లౌజ్ ధరిస్తే ఎప్పుడైనా చైన్ తో లాకెట్ వేసుకోవాలి. మంచి డ్రెస్ వేసుకుంటే సరిపోదు. దానికి తగిన జువెలరీ వేసుకుంటేనే పర్ ఫెక్ట్ లుక్ వస్తుంది.