Categories
మనుష్యుల ఆరోగ్యానికి పెంపుడు జంతువులు ఎంతో ఉపకరిస్తాయట . పెద్దపెద్ద హాస్పిటల్స్,చిన్ని నర్సింగ్ హోంలు అన్నీ పెట్ థెరపీ కోసం కుక్కలు,పిల్లులు ,చేపలు ,పక్షులు చివరికి గుర్రాలను ఉపయోగిస్తున్నారు . ఈ పెట్ థెరపీ ఇవాల్టది కాదు . ఏనాటినుంచో ఉంది . పెంపుడు జంతువులు ఉన్న ఇళ్ళలో వ్యాధి గ్రస్తులు ఉంటే ఎక్కువ కాలం జీవించినట్లు రికార్డ్ అయింది . పెంపుడు జంతువుల వల్ల బి పి కంట్రోల్ లో ఉంటుంది . జంతువులు ఇంట్లో ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ ఉత్పత్తి వాటిని పెంచే వాళ్ళలో పెరుగుతుంది మనిషి ఆనందంగా ఉండేందుకు సహకరించే హార్మోన్ ఇది . ఏదో ఒక జంతువునో ,పక్షినో చేరదీస్తే వాటికో ఇల్లు ,మనకు ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .