కండబలానికి గుర్తుగా పిడికిలి శక్తిని ఉపయోగిస్తారు. పరిశోధకులు  ఈ మధ్యకాలంలో 10 లక్షల మందిని పరిశీలించి అందులో దాదాపు ఐదులక్షల మంది సమాచారాన్ని ఆస్ట్రేలియా పరిశోధకులు విశ్లేషించారు. కండబలం ఉంటేనే జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందనీ, ఆపద ఎదురైనప్పుడు చురుగ్గా స్పందన చూపించి తప్పించు కొంటారని పరిశోధన ఫలితాలు చెప్పాయి. ఎంత గట్టిగా ఎంత సేపు పిడికిలి బిగించి పట్టుకొంటే అంత కండబలం ,గుండెబలం ఉన్నట్లు లెక్క ఈకండ బలం కోసం ఎరోబిక్స్ చేయాలంటున్నారు . ఈ ఎరోబిక్స్  రక్త సరఫరా మెరుగుపరిచి మెదడుకి మంచి పోషణ ఇస్తుందని చెపుతున్నారు.

Leave a comment