పెద్దవాళ్ళు అనుకరించే అలవాటు చిన్నప్పటి నుంచే పిల్లల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు ప్రతి రోజు నిత్యం ఒకటి నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. వాళ్ళు ఐదారు నెలలు వచ్చే సరికే ఊకొడుతూ పెద్దవాళ్ళతో మాట్లాడేందుకు చూస్తారు. ఆ సమయంలో వాళ్ళ ఆసక్తికి ఊతం ఇచ్చేలాగా పెద్దవాళ్ళు పిల్లలతో ఏదో ఒకటి మాట్లాడమంటున్నారు పరిశోధకులు. పెద్ద వాళ్ళ మాటలు పిల్లలు వింటూ ఉంటే వాళ్ళకి త్వరగా మాటలు రావటం మాత్రమే కాదు భాషాప్రావీణ్యం కూడా బావుంటుంది. పైగా పూవులు పక్షులు,ప్రకృతి పిల్లలకు పరిచయం చేస్తూ పెద్దవాళ్ళు మాట్లాతూ ఉంటే ఆ చిన్న చన్న పదాలు పిల్లలు తేలిగ్గా గుర్తు పెట్టుకొంటారు. పుస్తకాల్లో బొమ్మలు, లేదా కంటికింపైన రంగులతో ఉన్న బొమ్మలు చూపిస్తూ పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఇంకా త్వరగా అర్థం చేసుకోగలుగుతారు.
Categories