
అనగనగా ఓ రాజు అని కద చెప్పే అలవాటు, వింటూ ఊకొట్టే బుజ్జాయిలు మీ ఇంట్లో వున్నారా? రోజుకో కొత్త కధ చెప్పి పిల్లల్ని నిద్ర పుచ్చేస్తారా అని ప్రశ్నలదిగితే….. ఫోన్ లో రోజుని మొదలు పెట్టి ఫోన్ లో అలారం సెట్ చేసే అలవాటే మా ఇంట్లో అవి సమాధానం వస్తుంది. ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి కుటుంబానికి ఒక ఆత్మ వుంటుంది. సంస్కృతీ, సాంప్రదాయాలు ఒక జాతి సొత్తు అవి పిల్లలకు అందించేది కదల ద్వారానే. ఎందరో ఆదర్శ మూర్తులను గురించి కధలుగా పిల్లలకు చెప్పగలిగితేనే పిల్లలకు తల్లిదండ్రులు చేసే మేలు కధలు చెప్పడం తోనే భాష, భావం, పలుకులో నైపుణ్యం ఊహా శక్తిని పెంచడం జరుగుతాయి. పిల్లలకు ఎన్నో వస్తువులు కొని ఇవ్వగలం కానీ వాళ్ళతో మాట్లాడే సమయం ఇప్పుడు కనుక తీసుకురాకపోతే ఇంకేప్పటికీ మనకి ఆ అవసరం రానట్లే. పిల్లలు పెద్దయిపోతాయి, ఉద్యోగాలకేగిరిపోతారు. పెళ్ళిళ్ళు చేసుకొని స్ధిరపడతారు. మరి మనం కన్నా పిల్లలతో మనం సంతోషంగా గడిపె సమయం ఏది చెప్పండి. అందుకే ప్రతి రోజు ఓ అరగంట వాళ్ళకొ కధ చెప్పండి వాళ్ళతో గడపండి.