Categories
WoW

పిల్లల కోసం కోకాచీ కామిక్స్.

పిల్లలకు ఊహలకు రెక్కలోక్కే కధలు కావాలి. మాయా ప్రపంచం యుర్ధాలు, వీరోచిత గాధలు కావాలి. చినప్పుడు అమ్మ తినిపిస్తూ ఇదిగో అన్నం తినకపోతే బుచోదోస్తాడు అని భయపెడుతుంది. ‘అడుగదుగో బూచివాడు, వస్తాడా పిలిచారా’ అంటూ పాటలు పాది అబ్బాయిని నిద్ర పుచ్చుతుంది. అలా బూచిని మలయాళీలు ‘కొకాచీ’ అంటారు. అదిగో ఆ కోకాచీ పేరుతో పిల్లలకోసం చిన్ని చిన్ని అగ్గిపెట్టెల్లాంటి పెట్టెల్లో పట్టే పుస్తకాలు రూపొందించింది టీనా. ఈ కామిక్ పుస్తకాల్లో పిల్లలకు కావలసినన్ని సరదాలన్నీ ఉంటాయి. ఇంజనీరింగ్ చదివింది టీనా. భర్త ప్రతీక్ కధా రచయిత. అతను కధలు రాస్తే వాటికి చక్కని బొమ్మలు వేసి గ్రాఫిక్’ నవలలుగా సృష్టించింది టీనా. కోకాచి స్టూడియో పేరుతో ఎన్నో నవలు, పుస్తకాలు సృష్టించారు. ఇప్పుడు గాంగ్ స్టార్, ఓకే బంగారం సినిమాలను గ్రాఫిక్ నవలలుగా మార్చే ప్రయత్నంలో వున్నారు టీనా, ప్రతీక్ లు. పిల్లలు పుట్టిన రోజు బహుమతులుగా ఈ కోకాచీ కామిక్స్ బావుంటాయి చూడండి.

Leave a comment