నీహారికా, ఇప్పుడు ఇళ్ళల్లో పుల్లలకు చాలా అతి విలువైన బహుమతులు ఇవ్వడం గమనిస్తున్నా… ఏదేళ్ళ పిల్లాడికి బైక్ బహుమతిగా ఇచ్చేస్తారు. వాడూ స్పీడ్ గా నడిపెస్తూ ఉంటాడు. ఆమంచి నగలు, డబ్బు, ఖరీదైన వస్తువులు. ఇవే పిల్లవాడిని ఆనంద పెడతాయా అంటే ఖరీదు గురించి పసి వాడి పుట్టిన రోజుకి పిల్లవాడి తాత అవ్వలు వచ్చారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు వాడిని ఎంత అమితానందంలో ముంచిందో చెప్పలేను. ఇంతకీ ఆ తాత బహుమతి ఏమిటో తెలుసా మనుమడు పుట్టిన రోజు ప్రింటయిన నాటి వార్తా పత్రిక అది దాచి పెట్టి పెళ్ళాడి ఉహ వచ్చాకా గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక ఆ పిల్లవాడి అనండమె ఆనందం వాడు చిన్నప్పుడు తొడుక్కున్న చిన్ని చుక్కల లాగు అవ్వ బహుమతిగా ఇచ్చింది. నిజానికి ఈ రెండు డబ్బుతో కొలిస్తే విలువలేనివి కానీ పిల్లవాడికి ఇచ్చిన ఆనందంతో కొలిస్తే అత్యంత విలువైనవట అందుకే పిల్లలకు బహుమతులు వాళ్ళకు పనికి వచ్చేవిగా, వాళ్ళకి భవిష్యత్తులో పని కొచ్చేవిగా మంచి పుస్తకాలుగా చిన్ని వస్తువులు వుండాలి. అవి ఇచ్చిన వాళ్ళను గుర్తు చేయాలి. బహుమతులు మన మమకారానికి సంకేతాలు అలా అయితే అవి విలువైనవి అవుతయి.
Categories