Categories
Nemalika

పిల్లలను మరి బయపెట్టేస్తారు.

నెమలీక

నీహారికా, ఎప్పటి నుంచో ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాల్టికీ సమాజంలో ఉన్న నమ్మకాలు,ఆచారాలు ఆశర్యం, విచారం తెప్పిస్తూ ఉంటాయి. స్కూల్ విద్య అయిపోగానే హటాత్తుగా మొదలయ్యే రుతు క్రమం ఆడపిల్లలని అయోమయంలో పడేస్తుంది. తమ శరీరంలో జరుగుతున్న కొద్ది మార్పులకి వాళ్ళు కాస్త కంగారు పడి పోతారు. దీనికి తోడు ఇళ్లలోని పెద్దవాళ్ళు పలానా వస్తువు తినరాదు. ఇలా పద్దతిగా ఇవి తీసుకుంటూ ఉండాలి. ఇది మన ఆచారం, ఇది పెద్దలు నిర్ణయించిన పద్ధతి అంటూ నిబంధనల జాబితా ఎదురుగా పెట్టేస్తారు. ఈ అంటూ, ఆచారం వంటివి వాళ్ళను మరింత అయోమయానికి గురి చేస్తారు. ఈ విషయం లో ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది  పెద్ద వాళ్ళే. పిల్లల్ని గాబర పడకుండా ధైర్యం చెప్పి, శారీరక పరిశుభ్రత ఇతర విషయాలు గురించి భయపెట్టకుండా లాలనగా వివరించి అవసరమైన డాక్టర్ సలహా తీసుకోవాలి. మంచి పోషకాహరం ఇవ్వాలి. రుతుక్రమం ఒక శారీరక క్రియ. దానికి పత్యాలు, పద్దతులు అక్కర్లేదు. ఆ సమయం లో పిల్లలకి ఎం చేయాలో, ఈ పద్దతిని ఎలా అలవాటుగా తీసుకోవాలో చెప్పి వాళ్లకు భరోసా ఇస్తే చాలు.

Leave a comment