Categories
WoW

పిల్లి పిల్లలూ, పుర్రె బొమ్మలూ

పిల్లి మామూలుగా ఎదురొస్తేనే అపశకునం అనుకొంటాం. ఒక ప్రియురాలికి ముద్దుగా ప్రెజెంట్ చేసే రింగ్ వేలిపైన పిల్లి తొంగి చూస్తున్నట్లు కనిపిస్తే ఎలా వుంటుంది. ఒక పాము పిల్ల లాగానో, ఉడతల్లాగానో, బుర్ర మీసాలలాగానో, కాఫీ కప్పు లాగానో ఉందనుకో ఎలా అనిపిస్తుంది. కొంచెం వింతగా, కొత్తగా వెనక్కి తిరిగి చూడలన్నంతగా వుంటాయి. కల్లో అయినా ఒక పుర్రె కనిపిస్తే దడుచుకుని లేచి మంచినీళ్ళు తాగుతారు. అలాంటిది ఏకంగా ఓ అమ్మాయి ఒక పుర్రె ఉన్న ఉంగరం పెట్టుకుని చేతులూపుకుంటూ అలా నడుస్తూ పోతే తప్పకుండా చూస్తారు. లేదా పిలిచి ఆ ఉంగరం ఏమిటి అని ఆశక్తిగా చూస్తారు. అసలీ కొత్త ట్రెండ్ ఉద్దేశ్యం అదే ఇవి సర్ ప్రైజ్ గిఫ్టులు. బంగారం, వజ్రాలు, రంగు రాళ్లు, ముత్యాలు, దేవుడి బొమ్మలు మాయమైపోతూ, పిల్లులూ, ఉడతలూ, క్వశ్చన్ మార్కుల ఉంగరాలు వచ్చాయి. చూడండి మరి.

Leave a comment