ఈ వాతావరణానికి చర్మం పొడిబారి పోతూవుంటుంది. చర్మం పొట్టు రేగటం దురదలు కూడా వస్తాయి. మందుగా కావలిసింది చర్మానికి కావలిసిన నూనెను అందించటం. తేలికైన ఆలివ్ ఆయిల్ తో మస్సాజ్ చేస్తే మృదువుగా వుంటుంది. సబ్బుకుబదులు సోప్ ప్రీ క్లీన్సర్ వాడాలి స్నానం చేయగానే క్రీమ్ మాయిశ్చరైజర్ లేదా బాడీ బటర్ ను అప్లయ్ చేయాలి . పాలు అవిసెగింజల పొడి బ్రౌన్ షుగర్ కలిపి వారానికి ఒక్కసారి స్క్రబ్ చేయాలి. బ్రౌన్ షుగర్ లేకపోయినా మాములు పంచదార కలిపినా అదే ఫలితం ఉంటుంది. తేనె నిమ్మరసం అలోవెరా జెల్ బాదం నూనె లేదా నిమ్మరసం కలిపినా అవకాడో రాయటం వల్ల కూడా చర్మానికి తేమ లభిస్తుంది. రోజుకు 8 నుంచి పది గ్లాసుల మంచి నీళ్లు దాహం వేయకపోయినా తాగాలి సోయా టోఫు డైరీ ఉత్పత్తులు చికెన్ చేపలు ఆహారంలో భాగంగా ఉండాలి. క్యారెట్లు టమాటో బీట్ రూట్ బొప్పాయి కమలా నారింజ ఆకుకూరలు పుచ్చ వంటి ఆక్సిడెంట్స్ అధికంగా లభించే వివిధరంగుల పండ్లు కూరగాయలు తినాలి.
Categories