Categories
పాలీక్లే తో చేసిన ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ చూస్తే అచ్చమైన పూవులు ఆకులే ఆభరణాలుగా డిజైన్ చేసినట్లే ఉన్నాయి. వన్ గ్రామ్ గోల్డ్ అచ్చమైన బంగారం తో చేసిన నగల తో పోటీ పడుతూ ఇంకా చెప్పాలంటే అంతకంటే అందంగా ఉన్నాయి. డ్రెస్ బట్టి చెవిపోగులు మార్చుకొనే అమ్మాయిలకు ఈ పాలీక్లే ఫ్లోరల్ ఇయర్ రింగ్స్ తెగ నచ్చాయి క్యాజువల్ డ్రెస్ లు వేసుకొంటే రాళ్ళూ ఇతర లోహాలతో చేసిన జుంకీలు పెట్టుకోవటం ఫ్యాషన్. కానీ ఈ క్లే పువ్వుల నగలు మాత్రం మొత్తం ఆలోచన మార్చాయి. ఎలాటి డ్రెస్ కైనా చక్కని పువ్వుల ఆభరణాలు అందం తెచ్చాయి. మట్టి తో చేసిన పువ్వులంటే నమ్మేలా లేదు వీటిని చూస్తుంటే.