Categories
Gagana

సినిమా కోసం ఎంత అయినా కష్ట పడతా.

అలియాస్ జనకి ‘ రన్’ వంటి సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్ ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్ లో ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఇప్పుడామె మంచు మనోజ్ తో ఒక్కడే మిగిలాడు సినిమా చేస్తుంది. అనితా ఆంబ్రోస్ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఉద్యోగి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కుడా గ్లామర్ పరిశ్రమ పట్ల ఆకర్షణలో సినిమా రంగం వైపు వచ్చేస్తున్నారు. ఆంబ్రోస్ ఇందుకు మంచి ఉదాహరణ ఉద్యోగానికి నటనకు తేడా గురించి  చెప్తూ ‘ఉద్యోగంలో ఉదయం తొమ్మిది గంటలనుంచి సాయంత్రం దాకా చేస్తే సరిపోతుంది. కానీ సినిమా అలా కాదు పని వుంటే పది పదిహేను గంటలు అలా చేయవలసిందే. నటిని కావాలనుకోన్నది నా డ్రీమ్ గనుక పని వత్తిడి నాకు తెలియడం లేదు అంతగా సినిమాలను ప్రేమిస్తానంటుంది అనీషా అంబ్రోస్.

Leave a comment