Categories
సాధు జంతువులు ఆకులూ ,అలమలు తిని బతుకుతాయి కానీ భయంకరమైన పులులు,సింహాలు,మొసళ్ళు ఆలా శాఖాహారం తింటాయంటే నమ్ముతారా ? పైన మొసలి పొంగల్ మాత్రమే తింటుంది . అంటే అస్సలు నమ్మశక్యంగా ఉంటుందా ? కానీ కేరళ లోని కేసర మ్మద్ జిల్లాలు అనంత పద్మనాభ స్వామి గుడి సరస్సులో ఉండే బాచియా అనే మొసలి మాత్రం పొంగలి ప్రసాదం మాత్రమే తింటుంది . ఆలయ పూజారి ప్రసాదం తీసుకోని సరస్సు దగ్గరకు రాగానే మొసలి వడ్డుకు చేరి ప్రసాదం తింటుంది . ఆ చెరువులో చేపలకు కూడా ఎలాంటి హాని తలపెట్టదు . మొదటి నుండి ఈ ప్రసాదం మాత్రమే తింటూ ఉండటం వల్ల ఇదే అలవాటై పోయిందని స్థానికులు చెపుతున్నారు . ఈ సరస్సులో ఒకే మొసలి కనిపిస్తుంది . ఒకటి చనిపోతే మరో కొత్త మొసలి బాచియా స్థానం లోకి వస్తుందట .