సిల్క్ ఆర్గంజా తేలికగా ఉండే పట్టు దారాలతో నేస్తారు అలాగే సింథటిక్, పాలిస్టర్, నైలాన్ వంటి వాటి నుంచి కూడా ఈ ఫ్యాబ్రిక్ తయారవుతుంది. వీటిలో క్రిస్టల్ ఆర్గంజా, క్రష్డ్ ఆర్గంజా, సాటిన్ ఆర్గంజా, మిర్రర్ ఆర్గంజా వంటి రకాలు ఉన్నాయి. ఈ అందమైన పల్చని ఆర్గంజా చీరెల పైన హరివిల్లు వర్ణాల పువ్వులు లతలు త్రీడీ ఎఫెక్ట్ తో తీర్చిదిద్దుతున్నారు. అక్రిలిక్ పెయింటింగ్స్ కు బొమ్మలను చేర్చి వేసిన డిజైన్లు పార్టీ వేర్ గా చాలా బాగున్నాయి. హ్యాండ్ పెయింటింగ్ వేసిన ఆర్గంజా చీరెలు ఇప్పుడు నడుస్తున్న ఫ్యాషన్.

Leave a comment