కొన్ని కొన్ని ఫ్యాషన్స్ ఎప్పుడూ మారవు సారి కదా అందులో కొత్త ట్రెండ్స్ పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. టాటూస్ కు యువతలో క్రెజ్ పెరుగుతూనే వుంది. పెర్మనెంట్ వి, టెంపోరరీవి, పూలు, డిజైన్లు, పేర్లు, గుర్తులు ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు లిన్సెంట్ జనారిట్ అనే ఆర్టిస్ట్ నిజమైన పూల తో టాటూ లకు రూపకల్పన చేసాడు. ఇవి గుబాలించే పరిమళపు టాటూలు. ఇవి వేసుకుంటే వేరే సెంట్ వాడనక్కరలేదు. మూడు రకాల పువ్వులు వీటికోసం వాడారా ఆర్టిస్ట్ నీలంగా వుండే గులాబీ, వుదారంగుల్లో వుటే పియోనిచ్ గులాబీలతో వీటిని తయ్యారు చేసారు. ఈ టాటూలు స్టిక్కర్ల రూపంలో ఉంటాయి. టాటూ వేసుకున్న పలుచని పోర తీసేసి దాన్ని శరీరంపై పెట్టి కాస్త నీళ్ళ తడి తో రుద్దితే చాలుఅది శరీరానికి అటుక్కుపోతుంది ఇది తాత్కాలికమయింది. రెండు మూడు రోజుల్లో ఆనవాలు లేకుండా పోతుంది.
Categories