భూమికోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, సొంత జీవితాన్నే వదిలి పెట్టిన స్ఫూర్తి దాత మల్లు స్వరాజ్యం. (1931-2022) గ్రామాల్లో తిరిగి పనిచేసిన తుపాకీ పట్టిన గెరిల్లా గా అసెంబ్లీలో నిలబడినా ఎక్కడైనా, ఎప్పుడైనా ఆమెది పోరాటమే. దోపిడీ ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. పోరాటం ఉన్నంతకాలం మల్లు స్వరాజ్యం పేరు ఉంటుంది. అన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి తో పాటే ఆంధ్ర మహాసభ తరఫున బాలల సంఘం పెట్టారు స్వరాజ్యం. పదకొండవ ఏట నుంచే గేరిల్లా యుద్ధంలో శిక్షణ ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకుని పన్నెండేళ్ల వయసుకే ఆంధ్ర మహాసభలో చేరారా మే. తెలంగాణ లో వెట్టిచాకిరి, భూస్వాముల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమంలో పాల్గొన్నారు స్వరాజ్యం. సాయుధ పోరాట విరమణ తర్వాత 1978 లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లారు ఎమ్మెల్యే పదవి తర్వాత కూడా ఆమె పోరాట పంధాను వదిలి పెట్టేది లేదు ఆమె పోరాడని సమస్య లేదు.
Categories