Categories
మనం తీసుకొనే ఆకుపచ్చని కూరగాయలు,ఆకు కూరల్లో ఉండే మెగ్నిషియం కాల్షియం మెదడు పని తీరు పెంచుతాయి. రోజు వారి తీసుకొనే కాయలు, పండ్లు ఉండే రంగుల్లోనే పలు రకాల పోషకాలు ఉంటాయి. ఎర్రని కూరలు ,గుండెకు మంచివి. నలభై ఏళ్ళు వస్తుంటే ,ఎర్రని టోమోటోలు, దానిమ్మ,పుచ్చకాయ, ముల్లంగి వంటివి ఎక్కువగా తీసుకొంటే మతి మరుపు దగ్గరకు రాదు. వంకాయ,నేరేడు,ద్రాక్ష వంటి ఊద రంగు కూరగాయలు వృద్దాప్యాన్ని దగ్గరకు రానివ్వవు. గుడ్డులోని పచ్చ పొన, మొక్కజొన్న వీటిలో ఉండే ల్యూటెన్ కంటి చూపు మెరుగు పరుస్తుంది. అనాస,మామిడి ,పనస ఇవి కూడా విటమిన్ ఎ,డి,ఇ,బి6 కలిగి ఉంటాయి.