Categories
లాక్ డౌన్ సమయం దొరికింది కదా అని రాత్రి చాలా సమయం వరకు సినిమాలు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తూ నిద్రను పాడుచేసుకోకండి అంటున్నారు డాక్టర్లు. పగలు పని రాత్రి నిద్ర ఇది ప్రకృతి నియమం. ఈ ధర్మాన్ని ధిక్కరిస్తే ప్రాణాలకే ముప్పు అంటారు. రాత్రి వేళ మేలుకువగా ఉంటే డయాబెటిస్ అవకాశం 30 శాతం,నాడి సంబంధిత వ్యాధులు 25 శాతం ఎక్కువ. శ్వాసకోస జీర్ణకోశ వ్యాధులు కూడా అధికమే. సమయానికి నిద్రపోలేకపోతే అందుకు కారణం మానసిక సమస్య, ఇతర కార్యక్రమాలా అన్న విషయం తేల్చుకొని ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర పోగలిగితేనే ఆరోగ్యం అంటున్నారు.