టూత్ పేస్ట్ లు మౌత్ వాష్ లు చూయింగ్ గమ్స్ పెర్ఫ్యూమ్స్ వేటిలో చూసినా పుదీనా ఘుమఘుమలుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ వంటకాలతో ఈ హెర్బ్ వాడతారు. కూరల పొడులు, సలాడ్లు, బిర్యానీ లు , చట్నీలు ,జెల్లీలు ,క్యాండీలు ,ఐస్ క్రీమ్ లు కూడా పుదీనా విరివిగా ఉపయోగిస్తారు. వాటర్ మింటీ ,స్పియర్ మింట్ లీ కలిపి పెప్పర్, మింట్ సృష్టించారు. ఈ హైడ్రేటెడ్ పెప్పర్ మింట్ తో అనేక ప్రయోజనాలు. ఇది బ్రిత్ ఫ్రెష్నర్. నీళ్లలో ఒక్క చుక్క పెప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని తాగితే అజీర్ణం ,వికారం , గ్యాస్ సమస్యలు నిమిషంలో పోతాయి. ఈ ఎసెన్షియల్ ఆయిల్ తో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలుంటాయి. మూడ్ ను అనుకూలంగా మార్చే గుణం వుంది. ఎండిన పుదీనా ఆకుల పొడితో పళ్ళు తోమితే చక్కగా తెల్లగా మెరిసిపోతాయి. సాధారణ జలుబులు తగ్గిస్తుంది. పుదీనా ఆకుల్ని ఐస్ క్యూబ్స్ గా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. లెమన్ టీ, లెమనేడ్ కోసం ఈ క్యూబ్స్ ని వాడుకోవచ్చు. ఘాటైన వసంతో మంచి ఫ్లేవర్ గల మింట్ లో ఔషధ గుణాల కోసం ఒక పుస్తకం రాయచ్చు. ఇన్ని వస్తువుల పుదీనాతో తయారై కార్పొరేట్ ప్రపంచంతో అమ్ముడుపోతున్నాయంటే పుదీనా ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవచ్చు. పుదీనా ఎస్సెన్షియల్ ఆయిల్ నుంచి తీసే మెంథాల్ ను కాస్మొటిక్స్ లో పెర్ఫ్యూమ్స్ వాడతారు.
Categories