Categories
ఎండ వేళల్లో మెత్తగా కాటన్ సంఖ్యగా వుంటాయి. కానీ కాస్త వెరైటీగా ఉండాలంటే సీకొ చీరల వైపు చూడొచ్చు. ఎన్నో అందమైన రంగుల్లో, ప్రకృతి సోయగాలు మేళవించిన సీకో కాటన్స్ ఈ ఎండాకాలపు ఆకర్షణ. ఇవి ఏ వయస్సువారికైనా బావుంటాయి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో సీకో కాటన్స్ లో అద్భుతమైన వెరైటీలున్నాయి. పూల మోటిఫ్ ల తో వెడల్పాటి మెరిసే అంచులతో వేసవికే చల్లదనం సీకొ ముచ్చటగా వుండే పూల డిజైన్లు జియో మెట్రిక్ మెరుపులు లేలేత వర్ణాలతో ఇవి వేసవి ఫ్యాషన్స్, ప్రత్యేకంగా ఈ కాటన్ సీకోల పైన ప్రక్రుతి లోకి సంబందించిన పువ్వులు, పక్షులు, పచ్చని రంగులే వుంటాయి. చిన్ని జరీతోనూ, జరీ లేకుండా పుల్ డిజైన్ తోనూ, ఈ తేలికైన వస్త్ర శ్రేణి వెరైటీల సీకొ కాటన్స్ కోసం ఆన్ లైన్ లో చూడండి.