Categories
ఒక వయసు దాటాక పొట్ట వస్తుందంటే రక్తనాళాలు సంభందిత అనారోగ్యాలు డయాబెటిస్,క్యాన్సర్ వరకు ఒక్కో అడుగు పడుతున్నట్లే అంటున్నారు వైద్యులు. రెండు లక్షల పాతిక వేలమంది పైన 16 సంవత్సరాల కాలం సూదీర్ఘ కాలం ఒక పరిశోధన చేశారు. బరువు,ఎత్తు, పొట్ట కొలత తీసుకుని బాడీ మాస్ ఇండెక్స్ లెక్కలు గట్టి వారి ఆరోగ్య అనారోగ్య వివరాలు నమోదు చేస్తూ వచ్చారు. వారిలో పొట్ట పెరిగిన వాళ్ళందరు పలు రకాల అనారోగ్యాలకు గురైయ్యారు. చాలా మంది 40 నుంచి 45 ఏళ్ళ లోపు గుండె పోటుతో మరణించారు. మధ్య వయసులో పొట్ట బరువు రాకుండా చూసుకుంటే వృద్దాప్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయని రిపోర్ట్.