ఈ తరం అమ్మాయిలకు మోడ్రన్ డ్రెస్ లు అలవాటై ఎప్పుడైనా చక్కని చీరె కట్టుకోవాలంటే కంగారు పడిపోతారు. వేడుకల్లో అయితే మేకప్ ఆర్టిస్ట్ లతో పాటు శారీ డ్రేపర్లు వచ్చి చక్కగా అందంగా చీరె కట్టేస్తారు మరి ఏ సాయంకాలమో సరదాగా చీరె కట్టుకోవాలంటే ఎలా అన్న ప్రశ్నకు సమాధానం గా వచ్చింది. ప్లీటెడ్ సారీ ఫోల్టింగ్ బాక్స్.ఈ బాక్స్ గనుక ఉంటే చీరె కట్టుకోవటం కాస్త నచ్చింది వచ్చినా చాలు హాయిగా అందంగా ఉండేలా చీరకట్టుకోవచ్చు చీరెకు ముందుగానే కుచ్చుళ్ళు పైటకొంగు దేనికదే పెట్టేసి మడతలు పోకుండా ఐరన్ చేసేస్తారు. అవసరమైనచోట పిన్నులు పెట్టి చక్కగా మడత వేసి ప్యాక్ చేసి ఇస్తారు. ఆర్గంజా, పట్టు వంటివి, క్రేప్, శాటిన్ ,చీరెలు ముందుగా సిద్ధం చేయించుకుంటే అవసరం అయినప్పుడు ఐదు నిమిషాల్లో సిద్ధం అవ్వచ్చు. చెన్నై, బెంగుళూరు నగరాలతో పాటు హైదరాబాదులోనూ ఈ సర్వీస్ అందుబాటులో ఉంది.
Categories