Categories
అందానికి మెరుగులు దిద్దే ఆభరణాల చరిత్ర 40 వేల సంవత్సరాల నాటిది.ఆభరణాలలో వెండి ప్లాటినం, ముత్యాలు,విలువైన రాళ్లు లోహాలు అన్ని కలిసి జ్యువెలరీ అయింది. ఈ నగలో విరివిగా ఉపయోగించే విలువైన రాళ్ళు నవరత్నాలు వీటిని అత్యంత శక్తివంతమైనవి గా భావిస్తూ ప్రాచీన చక్రవర్తులు రాజులు ధరించే వాళ్ళు తొమ్మిది విలువైన రాళ్ల సమాహారమే నవరత్నాలు వజ్రం కెంపు, నీలం, పగడం, ముత్యం, పచ్చ, వైఢూర్యం, పుష్పరాగం, గోమేధకం, కలిపి నవరత్నాలు అంటారు. ఈ విలువైన రాళ్ళను అధ్యాత్మిక సంధానం ఎక్కువ .ఈ తొమ్మిదింటిలో వజ్రం అత్యంత శక్తివంతమైనది. వీటితో పాటు ఇంకా విలువైన విభిన్నమైన రాళ్ళు ఉన్నాయి.యాంబర్ ఇది ప్రాచీన జెమ్ స్టోన్. ఎమరాల్డ్, ఆకుపచ్చ నుంచి నీలి ఆకుపచ్చ దాకా ఉంటుంది.దీన్ని స్టోన్ ఆఫ్ హెలెన్స్ అంటారు. కెంపు అత్యంత విలువైన రాయి. మంచి ఎర్రని రంగుతో ఉంటుంది నీలం ఇంకా అరుదైనది . నైరుతి అమెరికా, ప్రపంచంలోకెల్లా ఎక్కువగా నీల ఖనిజ సంపద కలిగి ఉంది . ఇలా విలువైన రాళ్ళ చరిత్ర వేల సంవత్సరాల నాటిది .ఇవన్నీ పొదిగిన ఆభరణాలు విలువ పెరుగుతూనే ఉంది .కాలానుగుణంగా ఆభరణాల డిజైన్ లలో మార్పులు వచ్చాయి .కానీ వాటి పట్ల అభిరుచి ఇష్టం మటుకు ఎప్పటికీ మారాకుండానే ఉంది.