Categories
కనుబొమ్మలు చక్కని ఆకృతిలో వంపుతిరిగి ఉండాలంటే ప్రతిరోజు రాత్రి వేళ రెండు చుక్కల ఆముదం కనుబొమ్మలకు రాసి మర్దనా చేయాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ బాగా జరిగి ఇందులో ఉండే ప్రోటీన్లు ఫ్యాటీ యాసిడ్లు,యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు కనుబొమ్మలకు అంది ఒత్తుగా పెరుగుతాయి. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ,ఇ ఉంటాయి ఇవి జుట్టు పెరిగేందుకు ఉపయోగపడతాయి. రెండు చుక్కల ఆలివ్ నూనె తో ప్రతిరోజు కనుబొమ్మల మర్ధన చేసినా సరే చక్కగా ఒత్తుగా పెరుగుతాయి. అలాగే కొబ్బరి నూనె కూడా చక్కని కండిషనర్ మాయిశ్చరైజర్ కూడా గోరువెచ్చని కొబ్బరి నూనెతో కనుబొమ్మల మర్దనా చేస్తే వెంట్రుకల ఎదుగుదల బాగుంటుంది.