Categories
కొత్తగా ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనుకొనే వాళ్ళు మొక్కలను కొనే చోటనే వాటి గురించి క్షుణంగా తెలుసుకోవాలి. నర్సరీల్లో కాస్త పెరిగిన మొక్కలు తీసుకొంటాం కనుక వాటి జాగ్రత్తలు తెలుసుకోవటం తేలికే. టోమాటో,ఉల్లిపాయలు,కొన్ని రకాల ఆకుకూరలు పెంచటంలో పెరటి తోటకు శ్రీకారం చుట్టవచ్చు. కొన్ని నీడలో పెరిగే మొక్కలు కూడా ఉంటాయి. కొన్ని సూర్యరశ్మిని తట్టుకోగలుతాయి. మొక్కలకు ప్రతి రోజు నీళ్ళు పోయాలి. సేంద్రియ ఎరువులు వాడి మొక్కలకు పట్టే చీడపీడలను కూడా వేప నూనె వంటివి ఉపయోగించవచ్చు. మొక్కలు పెంచుకొంటే రసాయనాలు అంటని ఆరోగ్యకరమైన కూరలు తినే అవకాశం వస్తుంది. కొద్దీ పాటి చోటు ఉన్నా కుటుంబాలు అవసరాలకు సరిపడే కూరగాయలు పెంచుకొవచ్చు.