Categories
పొట్టలో పాపాయికి తల్లి ఇచ్ఛే గొప్ప కానుక చక్కని పోషకాహారం ,కూరగాయలు ,పూర్తిస్థాయి ధాన్యాలు ,పప్పులు లేక ప్రోటీన్ లభించే పదార్థలు ఆహారంలో భాగంగ ఉండాలి . ఇవి తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతాయి . గర్భవతులు మొదటి రెండు మూడు నెలల్లో మూడొందల క్యాలరీల ఆహారం అధికంగా తీసుకోవాలి . పూర్తి స్థాయి కార్భోహైట్రేడ్స్ ఉండాలి . రకరకాల పండ్లు కూరగాయలు ప్రతిరోజు కనీసం ఏడుసార్లు తీసుకోవాలి . పండ్లరసం కంటే పండ్లు తీనడమే మంచిది . కెఫైన్ పరిమితంగా తీసుకోవాలి . ఉడికించని ,ప్రాసెస్ చేసిన మీట్స్ ,అదీకాక మష్రూమ్స్ అండ్ చేపలు లివర్ ఆన్ పాశ్ఛ రైజ్డ్ డెయిరీ ఉత్పత్తులు తినకూడదు . ఆరోగ్యవంతమైన ఆహారం తేలికపాటి వ్యాయామాలు చేస్తూ అధిక బరువు సమస్య ఎదురవ్వదు .