తియ్యని బెల్లం ,తేనె చర్మానికి కాంతి నిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . బెల్లంలో ఉన్న యాంటీ ఆక్సి డెంట్స్ శరీరంలో తయారయ్యే ఫ్రీ రాడికల్స్ నిర్వీర్యం చేసి చర్మం పైన ముడతలు లేకుండా కాపాడతాయి . బెల్లంపొడి లో కొంత పరిమాణంలో తేనె రెండుచుక్కలు నిమ్మరసం కలిపి ముద్దగా చేసి దానితో ముఖం ,మెడ రుద్దుకొని పదినిముషాలు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి . బెల్లంలో ఉండే గ్లె కొలాక్ ఆమ్లం చర్మం సాగే గుణాన్ని కాపాడుతుంది . తేనె తో చర్మం లోని సూక్ష్మరంధ్రాలలో మురికి తొలగిపోతుంది . తేనె రకరకాల జీవుల్ని నాశింపచేస్తుంది . గాయాలకు తేనె రాస్తే చర్మం సాధారణ స్థితికి వస్తుంది . ఈ మూడు కలిపి ఒక ముందులాగ చర్మకాంతిని ఇనుమడింప చేస్తుంది .

Leave a comment