Categories
దేశంలో లాక్ డౌన్ సమయంలో గృహహింస కేసులు ఎక్కువయ్యాయి .అలాటి మగవారికి పుణే అధికారులు కొత్త రకం శిక్ష విధిస్తున్నారు . జాతీయ స్థాయిల్లో నమోదవుతున్న ఈ కేసుల్లో భార్యను కొడుతున్న, తిడుతున్న భర్తలకు గృహ హింస కేసు నమోదు కాగానే ఇన్ స్టిట్యూషన్ క్యారంటైన్ కు పంపుతున్నారు .లాక్ డౌన్ సమయంలో ఆల్కహాల్ లభించక మగవాళ్ళు ఆడవాళ్ళ పై ప్రతాపం చూపిస్తున్నారు .ఇలాటి కేసుల విషయంలో పూణే జిల్లాలో విజిలెన్స్ కమిటీ నియమించారు .ఈ కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్ళి గృహ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు .వారితో కలిసి గ్రామీణ పోలీస్ స్టేషన్ లు, డి ఎస్ సి క్యాంప్ ఆఫీసర్ లు కోఆర్డినేట్ చేస్తూ గృహ హింస కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు .