Categories
ప్రశ్న లేకపోతే పురోభివృద్ధి లేదు. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారు అంటే వాళ్లు ఆలోచిస్తున్నారని అర్థం వాళ్ళ మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు లెక్క. బుద్ధుడు సమాజంలో వృద్ధులను రోగులను చూసి ఎందుకీ పరిస్థితి అనే ప్రశ్న తలెత్తి రాజ్యం వదిలి సమాధానం కోసం వెళ్ళాడు జ్ఞానోదయం తరువాత బౌద్ధ మార్గం మానవాళికి సూచించాడు. భూమి మీదికే పండు ఎందుకు రాలుతుంది అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తేనే న్యూటన్ భూమి ఆకర్షణ అని అర్థం చేసుకున్నాడు మరణం గురించి ఆలోచించి రమణ మహర్షి ఆధ్యాత్మిక చింతనతో భగవానుడు డయ్యాడు.చరిత్ర సృష్టించిన వారందరూ ప్రశ్నలు వేసుకున్న వారే అందుకే సమాధానం కోసం పెద్దల వైపు చూస్తూ ప్రశ్నలు అడిగే పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఎన్నో విషయాలు జరుగుతుంటాయి దాని అర్థం చేసుకునే శక్తి వారికి ఉండదు అందుకే ప్రశ్నలు వేస్తారు ఓపికగా సమాధానాలు ఇవ్వాలి ప్రశ్నలు లేనిదే నాగరికత లేదు.ప్రశ్నలు లేనిదే మానవ వికాసం కూడా సాధ్యం కాదు ప్రశ్నిస్తేనే జీవితం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134