నేషనల్ రేసింగ్  ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి మహిళ గా నిలిచింది డయానా పండోల్. ఈమెది పూణే. రేసింగ్ అంటే ప్రాణం పెట్టే తల్లిదండ్రులతో కలిసి రేసింగ్ నేర్చుకుంది. జాతీయస్థాయిలో కాదు యూఎస్ ఎ, సింగపూర్, బెల్జియం, యూరప్ తో సహా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని కప్పులు గెలుచుకుంది. ఇద్దరి పిల్లల తల్లి డయానా.  ఛాంపియన్‌షిప్ లో పురుషుల తో పోటీపడి మరీ సత్తా చాటింది డయానా. ఈమె సింగర్ కూడా. అంధుల కోసం పరీక్షలు రాసి పెడుతుంది. మోటార్ వెహికల్స్ రేసింగ్ లపై ఆసక్తి ఉన్న అమ్మాయిలను ప్రోత్సహిస్తుంది డయానా పండోల్.

Leave a comment